శనివారం 06 జూన్ 2020
International - Apr 12, 2020 , 13:39:46

జోరుగా శ‌వ‌పేటిక‌ల వ్యాపారం..

జోరుగా శ‌వ‌పేటిక‌ల వ్యాపారం..

హైద‌రాబాద్: యూరోప్‌లో ఇప్పుడు శ‌వ‌పేటిక‌ల బిజినెస్ బిజీగా సాగుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణాల రేటు పెర‌గ‌డంతో.. శ‌వ‌పేటిక‌ల వ్యాపార కంపెనీలు ప‌గ‌లురాత్రి తేడా లేకుండా ప‌నిచేస్తున్నాయి. వాస్త‌వానికి ఇది ఓ హృద‌య‌విదార‌క‌ర ప‌రిస్థితి. కానీ యూరోప్‌లో శ‌వ‌పేటిక‌లు త‌యారు చేసే అతిపెద్ద కంపెనీ ఓజీఎఫ్ మాత్రం త‌మ ఉద్యోగుల‌ను ఓవ‌ర్‌టైం ప‌నిచేయించుకుంటున్న‌ది. ఈస్ట్ర‌న్ ఫ్రాన్స్‌లో ఈ కంపెనీ ఉన్న‌ది. త‌మ బంధువులు వైర‌స్‌తో మృతిచెందుతున్న నేప‌థ్యంలో.. అక్క‌డ శ‌వ‌పేటిక‌ల‌కు డిమాండ్ పెరిగింది. అయితే ప్ర‌స్తుతం డిమాండ్ అధికంగా ఉన్న కార‌ణంగా.. కేవ‌లం నాలుగు ర‌కాల టాప్ మోడ‌ల్స్ మాత్ర‌మే త‌యారు చేస్తున్న‌ట్లు ఓజీఎఫ్ డైర‌క్ట‌ర్ ఎమ్మాన్యువ‌ల్ గారెట్ తెలిపారు. సాధార‌ణంగా మామూలు స‌మ‌యంలో ఆ కంపెనీ సుమారు 15 ర‌కాల కాఫిన్‌ల‌ను త‌యారు చేస్తుంటుంది. logo