ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రావడమే గగనంగా మారిపోయింది. అలాంటిది వచ్చిన అవకాశాలను వెనక్కి తిప్పి పంపడం అనేది దాదాపు అసాధ్యం. కానీ సాయిపల్లవి మాత్రం అలా కాదు. కథ, అందులో తన పాత్ర నచ్చకపోతే ఎంతటి సినిమాకు అయినా నో చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే సాయిపల్లవికి తాజాగా బాలీవుడ్ సినిమాలో మంచి ఆఫర్ వచ్చింది. కానీ దానికి ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది.
సాధారణంగా సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ ఆఫర్ వస్తే వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. అలాంటిది సాయిపల్లవి మాత్రం ఏకంగా రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానంటే కూడా కనీసం అటువైపు చూడలేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా రీమేక్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు జోడీగా దర్శక నిర్మాతలు మొదట సాయిపల్లవిని అనుకున్నారట. ఇందులో నటించడానికి సాయిపల్లవిని ఒప్పించేందుకు దర్శకనిర్మాతలు బాగానే ట్రై చేశారు. ఏకంగా రెండు కోట్లకు పైగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈమె కంటే ముందు కొందరు బాలీవుడ్ హీరోయిన్లను కూడా అప్రోచ్ అయ్యారు. కానీ వాళ్లు నో చెప్పడంతో సాయిపల్లవి దగ్గరికి వచ్చారు. అయితే ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది. ఏదేమైనా కూడా డబ్బు కోసం చూసుకోకుండా కేవలం పాత్ర నచ్చితేనే సినిమాలు ఎంపిక చేసుకుంటుంది సాయిపల్లవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైరల్
డబ్బు కోసం నన్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్
మీ అసాధారణ సహకారానికి సాటిలేదు : మహేశ్‌బాబు
ఎన్టీఆర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన చిరంజీవి
చనిపోయినట్టు ప్రచారం.. ఖండించిన శక్తిమాన్ నటుడు
సమంత శీర్షాసనం.. వైరల్‌గా మారిన వీడియో
కరోనా నుండి కోలుకున్న అల్లు అర్జున్
ఓటీటీలో నితిన్ చిత్రం.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
కరోనాతో నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత