ఆదివారం 17 జనవరి 2021
International - Dec 17, 2020 , 18:18:11

నదితీరంలో తాబేళ్ల సునామీ..వైరల్‌ వీడియో

నదితీరంలో తాబేళ్ల సునామీ..వైరల్‌ వీడియో

బ్రెజిల్‌లోని అమెజాన్ నదికి ఉపనది  పురస్ నదితీరం వెంబడి ఉన్న  రక్షిత ప్రాంతంలోని ఇసుక బీచ్ నుంచి తాబేళ్లు బయటకు వస్తున్న వీడియోను స్వచ్ఛంద సంస్థ  వైల్డ్‌లైఫ్‌  కన్జర్వేషన్‌ సొసైటీ(డబ్లూసీఎస్‌)   విడుదల చేసింది. బీచ్‌లో సుమారు 92వేల నది తాబేళ్లు  పొదిగినట్లు అంచనా వేస్తున్నారు.    దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఒక్క రోజులోనే సుమారు 71,000  తాబేలు పిల్లలు బయటకు రాగా కొన్ని రోజుల తరువాత మరో 21,000 పిల్లలు పుట్టుకొచ్చాయి.  

సాధారణంగా ఒడ్డుకు చేరుకున్న తాబేళ్లు సురక్షితమైన ప్రాంతంగా భావించిన చోట దాదాపు మీటరు లోతు గోతులు తవ్వి గుడ్లు పెడతాయి. గుడ్లు రెండు నెలల వ్యవధిలో పొదిగి పిల్లలవుతాయి. పొదిగిన గుడ్ల నుంచి వచ్చిన తాబేలు పిల్లలు తల్లి తాబేలు సహాయం లేకుండానే తమ తల్లి ఉండే ప్రాంతానికి వెళ్లిపోతాయట.