శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 27, 2020 , 11:42:19

సూడాన్‌లో వ‌ర్గ‌పోరు... 60 మంది మృతి!

సూడాన్‌లో వ‌ర్గ‌పోరు... 60 మంది మృతి!

డార్ఫ‌ర్‌: సూడాన్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన అల్ల‌ర్ల‌లో 60 మందికి పైగా మృతిచెందిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించింది. మ‌రో 60 మందికిపైగా తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలిపింది. ప‌శ్చిమ డార్ఫ‌ర్ ప్రావిన్సు రాజ‌ధాని జెనేనాకు ద‌క్షిణాన 48 కి.మీ. దూరంలో ఉన్న మ‌స్తేరీలో ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని సూడాన్‌లోని యూఎన్ ఆఫీస్ ఫ‌ర్ ద కో ఆర్డినేష‌న్ ఆఫ్ హ్యూమ‌న్ అఫైర్స్ వెల్ల‌‌డించింది. 

ముస‌లిట్‌, ఇత‌ర అర‌బ్ తెగ‌ల మ‌ధ్య ఈ ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయ‌ని పేర్కొంది. శ‌నివారం సాయంత్రం ఓ వ‌ర్గానికి చెందిన 500 మంది సాయుధులు మ‌స్తేరి గ్రామంపై దాడిచేశార‌ని, ఆదివారం ఉద‌యం వ‌ర‌కు ఇది కొన‌సాగింద‌ని తెలిపింది. ఇందులో 60 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, మ‌రో 60 మంది గాయ‌ప‌డ్డార‌ని ప్ర‌క‌టించింది. క్ష‌త‌గాత్రుల‌ను హెలికాప్ట‌ర్‌లో జెనేనా ప‌ట్ట‌ణంలోని ద‌వాఖాన‌కు త‌ర‌లించార‌ని వెల్ల‌డించింది.


logo