శనివారం 06 జూన్ 2020
International - Apr 04, 2020 , 14:38:29

37వేల మందిని తరలించిన అమెరికా

37వేల మందిని తరలించిన అమెరికా

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న నేపధ్యంలో అమెరికా తమ పౌరులను స్వదేశానికి తరలిస్తున్నది. ఇప్పటివరకు 37 వేలకు పైగా అమెరికన్లను 60 దేశాల నుంచి తరలించింది. వీరికోసం 400లకుపైగా విమానాలను ఏర్పాటుచేసింది. అయినా మరో 20 వేల అమెరికన్లు వివిధ దేశాల్లో ఉన్నారని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎక్కువమంది భారత్‌, దక్షిణాసియా దేశాల్లో ఉన్నారని తెలిపింది. వీరందరికోసం సుమారు 70 విమానాలను నడపనున్నామని వెళ్లడించింది. కరోనా వైరస్‌తో అమెరికాలో ఏడువేలమంది మరణించగా, 2.7లక్షల మంది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo