గురువారం 28 మే 2020
International - Apr 29, 2020 , 14:19:35

త్రిశంకు స్వ‌ర్గంలో 2 ల‌క్ష‌ల మంది

త్రిశంకు స్వ‌ర్గంలో 2 ల‌క్ష‌ల మంది

అమెరికాలో హెచ్ 1బీ వీసాల‌తో నివాసం ఉంటున్న దాదాపు 2 ల‌క్ష‌ల మంది భ‌విష్య‌త్తు ఇప్పుడు అగమ్య‌గోచ‌రంగా మారింది. భార‌త్‌తోపాటు వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్లిన సాంకేతిక నిపుణుల హెచ్ 1బీ వీసాల గ‌డువు జూన్ నాటికి ముగిసిపోతున్న‌ది. అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం ఇప్ప‌ట్లో ఈ వీసాల గ‌డువు పొడిగించేందుకు సిద్ధంగాలేరు. దాంతో వీరంతా ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. నిజానికి హెచ్ 1బీ వీసాలు అమెరికాలో ఉద్యోగాలు ల‌భించిన‌వారికే జారీ చేస్తారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఉద్యోగం పోతే ఆ రోజునుంచి 60 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత కూడా దేశంలో ఉంటే చ‌ట్ట‌వ్య‌తిరేకంగా నివాసం ఉంటున్న‌ట్లే. వారిపై అమెరికా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. 

ఇప్పుడు కోవిడ్‌-19 కార‌ణంగా అమెరికానే తీవ్రంగా న‌ష్ట‌పోతుండ‌టంతో అన్నిర‌కాల కంపెనీలు ఉద్యోగుల‌కు చాలావ‌ర‌కు జీతం లేని సెల‌వులు ప్రక‌టించాయి. దేశంలో లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత కూడా చాలామందిని మ‌ళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకొనే ప‌రిస్థితి క‌నిపించ‌టంలేదు. ఉద్యోగాల్లోకి తీసుకోకుంటే వారి వీసాలు పొడిగించ‌టం సాధ్యంకాదు. దాంతో ఇప్పుడు విదేశీ సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. 


logo