ఆదివారం 17 జనవరి 2021
International - Jan 06, 2021 , 16:33:00

స్పుత్నిక్-వీ టీకా తీసుకున్న 10 ల‌క్ష‌ల మంది..

స్పుత్నిక్-వీ టీకా తీసుకున్న 10 ల‌క్ష‌ల మంది..

మాస్కో: కోవిడ్‌19 నియంత్ర‌ణ కోసం ర‌ష్యా .. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను రూపొందించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దేశంలో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య ప‌ది ల‌క్ష‌లు దాటిన‌ట్లు స్పుత్నిక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. స్పుత్నిక్ వీ టీకాను రెండు డోసులుగా ఇస్తున్నారు.  రెండు విభిన్న కాంపోనెంట్ల‌ను 21 రోజుల తేడాలో ఇవ్వ‌నున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ ఆరంభంలోనే ర‌ష్యాలో స్పుత్నిక్ టీకా పంపిణీ స్టార్ట్ అయ్యింది. జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎల‌క్ట్రానిక్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌నున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ర‌ష్య‌న్ల డేటాబేస్ త‌మ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. స్పుత్నిక్ టీకాను ఇత‌ర దేశాల‌కు కూడా ర‌ష్యా స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.  గ‌త వార‌మే అర్జెంటీనాకు సుమారు మూడు ల‌క్ష‌ల డోసుల‌ను ర‌ష్యా పంపింది. దీని ప‌ట్ల స్థానికంగా నిర‌స‌న వ్య‌క్తం అయ్యింది. స్థానిక ప్ర‌జ‌ల‌కు ఒక్క డోసులు అందుబాటులో ఉండాల‌ని డిమాండ్లు వెల్లువెత్తాయి.  ర‌ష్యాలో ఇప్ప‌టి వ‌ర‌కు  3 ల‌క్ష‌ల‌కుపైగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.