గురువారం 04 జూన్ 2020
International - Apr 17, 2020 , 19:11:46

మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేశాం : జ‌ర్మ‌నీ

మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేశాం : జ‌ర్మ‌నీ

హైద‌రాబాద్‌: త‌మ దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉన్న‌ట్లు జ‌ర్మ‌నీ ఆరోగ్య‌శాఖ మంత్రి జెన్స్ స్పాన్ తెలిపారు. దేశంలో ఇన్‌ఫెక్ష‌న్ రేటు త‌గ్గిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వైర‌స్ బారి నుంచి కోలుకుంటున్న‌వారి సంఖ్య‌... కొత్త‌గా వైర‌స్ సంక్ర‌మిస్తున్న వారి సంఖ్య క‌న్నా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతానికి దేశ‌వ్యాప్తంగా వైర‌స్ కంట్రోల్‌లో ఉన్న‌ద‌న్నారు. వైర‌స్ సంక్ర‌మ‌ణ రేటు కేవ‌లం 0.7గా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. కానీ మ‌ర‌ణాల సంఖ్య మాత్రం ప్ర‌స్తుతం పెరుగుతున్న‌ది. హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు కూడా వైర‌స్ సోకుతున్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు.  జ‌ర్మ‌నీలో చాలా విస్తృత స్థాయిలో క‌రోనా టెస్టింగ్ నిర్వ‌హించారు. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా 38 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు 3868 మంది మ‌ర‌ణించారు. 
logo