బుధవారం 03 జూన్ 2020
International - Apr 26, 2020 , 13:18:16

సింగ‌పూర్ వీధుల్లో అరుదైన జంతువుల చ‌క్క‌ర్లు..వీడియో

సింగ‌పూర్ వీధుల్లో అరుదైన జంతువుల చ‌క్క‌ర్లు..వీడియో

క‌రోనా వైర‌స్ ధాటికి  చాలా వ‌ర‌కు దేశాలు లాక్ డౌన్ ను పాటిస్తోన్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో జ‌నాలెవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి. మనం జ‌నావాసాల్లోకి రావాలంటే ఇదే స‌రైన స‌మ‌యం అన్న‌ట్లుగా చాలా వ‌ర‌కు జంతువులు..రోడ్ల‌పైకి క‌నిపిస్తున్నాయి. తాజాగా ఒట్ట‌ర్లు సింగ‌పూర్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సింగ‌పూర్ లోని ముస్తాఫా షాపింగ్ మాల్ ద‌గ్గ‌ర ఒట్ట‌ర్ల గుంపు క‌నిపించింది. 

చాలా అరుదుగా క‌నిపించే ఈ దృశ్యాల‌కు సంబంధించిన వీడియోను సౌర‌వ్ స‌న్యాల్ అనే జ‌ర్న‌లిస్ట్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ జంతువువులు స‌ముద్ర‌తీర ప్రాంతాల‌కు స‌మీపంలో క‌నిపిస్తుంటాయి. చేప‌లు, క‌ప్ప‌లు, ప‌క్షులను ఆహారంగా తీసుకుంటాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo