బుధవారం 27 మే 2020
International - Apr 18, 2020 , 11:35:08

ఇవాంక తీరుపై విప‌క్షాల మండిపాటు

ఇవాంక తీరుపై విప‌క్షాల మండిపాటు

అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే.. మ‌రో వైపు అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు, కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుంటే ఇవాంక మాత్రం త‌న ఫ్యామిలీతో క‌లిసి  న్యూజెర్సీలో జ‌రిగిన యూదుల పండుగ పొసోవ‌ర్ పండ‌గఉత్స‌వాల్లో పాల్గొన్నారు. అయితే దేశం క్లిష్ట‌స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు..ఇవాంక వేడుక‌ల్లో పాల్గొన‌డ‌మేంటని ప్ర‌తిప‌క్ష పార్టీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పార్టీల‌కు ఇది స‌మ‌యం కాద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని సూచించారు.logo