ఇజ్రాయెల్ వైద్యులకు భారతసంతతి వైద్యుడి సాయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఇజ్రాయెల్లో తలలు అతుక్కొని జన్మించిన ఇద్దరు కవలలకు ఆపరేషన్ చేయడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన న్యూరో సర్జన్, భారత సంతతి వైద్యుడు నూర్ ఉల్ ఒవసీ జిలానీ అక్కడి వైద్యులకు సాయం చేశారు. శస్త్రచికిత్స విజయవంతం అయింది. అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న జిలానీని సాయాన్ని ఇజ్రాయెల్ వైద్యులు గతంలో కోరారు. జిలానీ ఆరు నెలల పాటు ఇజ్రాయెల్ వైద్య బృందంతో మాట్లాడుతూ వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు.