శనివారం 06 జూన్ 2020
International - Apr 04, 2020 , 18:58:37

సంఘీభావంతోనే వైర‌స్‌ను ఓడించ‌గ‌లం: ఐక్య‌రాజ్య‌స‌మితి

సంఘీభావంతోనే వైర‌స్‌ను ఓడించ‌గ‌లం: ఐక్య‌రాజ్య‌స‌మితి


హైద‌రాబాద్‌: సంఘీభావం, ఐక్య‌త‌తోనే వైర‌స్‌పై విజ‌యం సాధించ‌గ‌ల‌మ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ తెలిపారు.  ఉత్త‌మ‌మైన భ‌విష్య‌త్తును నిర్మించేందుకు దేశ‌దేశాల మ‌ధ్య సంఘీభావం అవ‌స‌రమ‌న్నారు.  ప్ర‌పంచ‌దేశాలకు ఇప్పుడు ఇది అత్య‌వ‌స‌ర‌మ‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. దూకుడుగా, వినూత్నంగా, క‌లిసిక‌ట్టుగా అన్ని దేశాలు వైర‌స్‌పై పోరాటం చేయాల‌న్నారు. దాంతోనే వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌గ‌ల‌మ‌న్నారు.  ప్ర‌పంచ ఓ అనూహ్య‌మైన ప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్న‌ద‌న్నారు. కోవిడ్‌19పై త‌యారు చేసిన రిపోర్ట్‌ను ఆయ‌న రిలీజ్ చేశారు.  మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు దాని వ్యాప్తిని అరిక‌ట్టాల‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాల‌ను, వారి జీవనోపాధిని కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  ప్ర‌స్తుత సంక్షోభం నుంచి నేర్చుకున్న అంశాల‌తో బెట‌ర్ ఫ్యూచ‌ర్ కోసం నిర్మాణాత్మ‌క ప‌నులు చేప‌ట్టాల‌న్నారు.logo