శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 19, 2020 , 14:33:33

క‌రోనా వైర‌స్ లేని ఖండం ఏంటో తెలుసా ?

క‌రోనా వైర‌స్ లేని ఖండం ఏంటో తెలుసా ?

హైద‌రాబాద్‌:  నోవెల్ క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌ని ఖండం ఏంటో తెలుసా ?  అది అంటార్కిటికా.  ప్రస్తుతం అన్ని దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.  కానీ  అంటార్కిటికాలో మాత్రం ఇంకా ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు.  అక్క‌డ ప‌లు దేశాల‌కు చెందిన అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌కులు ఉన్నారు.  ఎటువంటి ఇన్ఫెక్ష‌న్లు కానీ క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న కేసులు న‌మోదు కాలేదు. అంటార్కిటికా వెళ్లే బ్రిటీష్ ప‌రిశోధ‌కులు ఎవ‌రైనా 14 రోజుల‌ క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.  వేర్వేరు స్టేష‌న్ల‌లో ఉంటున్న వారికి స‌రుకుల స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు.  ప్ర‌తి ఏడాది సుమారు వెయ్యి మంది ప‌రిశోధ‌కులు వేర్వేరు దేశాల నుంచి అంటార్కిటికాకు చేరుకుంటారు. అయితే ఆ ఖండానికి స‌మీపంగా హాస్పిట‌ల్ ఏదీలేదు.  వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చిలీలో హాస్పిట‌ల్ ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు.  


logo