ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 27, 2020 , 21:12:31

హజ్‌ యాత్రకు కొద్ది మందికి మాత్రమే అనుమతి

హజ్‌ యాత్రకు కొద్ది మందికి మాత్రమే అనుమతి

న్యూఢిల్లీ : కరోనా కారణంగా ఈ సారి హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఈ సారి కేవలం పది వేల మందికి మాత్రమే సౌదీ ప్రభుత్వం అనుమతినిస్తోంది. వీరిలో విదేశీయులు 70 శాతం కాగా.. స్వదేశీయులు 30 శాతం మంది. కేవలం 160 దేశాలకు చెందిన వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించనున్నారు. ఈ  పవిత్ర యాత్ర సందర్భంగా ఇక్కడ ప్రతి చోటా కూడా కరోనాను నియంత్రించేందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్య, ఇతర శాఖల మధ్య పూర్తిస్థాయి సహకారముందని ప్రభుత్వం వెల్లడించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo