శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 17:46:09

ఎయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం

ఎయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం

న్యూఢిల్లీ : ఈ నెల చివరి వరకూ ఎయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం విధించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ సీరియర్‌ అధికారి సైతం ధ్రువీకరించారు. భారత్‌ నుంచి వెళ్లిన ఓ వ్యక్తికి హాంకాంగ్‌లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో హాంకాంగ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. జూలైలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ప్రయాణానికి 72గంటల ముందు కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌గా ఉంటేనే విమానం ఎక్కేందుకు అనుమతి ఇస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్యాసింజర్స్‌ తమ ప్రయాణం అనంతరం హాంకాంగ్‌ విమానాశ్రయ ప్రాంగణంలో తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని నిబంధనలు పెట్టారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం హాంకాంగ్‌ వెళ్లగా అక్కడ ప్రయాణీకులకు నిర్వహించిన పరీక్షల్లో ఒకరికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆగస్టు చివరి వరకు ఎయిర్‌ ఇండియా విమానాలను నిషేధం విధించినట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, ఖజకిస్తాన్‌, పాకిస్తాన్‌, దక్షిణ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్‌, అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులంతా తప్పనిసరిగా ప్రీ ఫ్లైట్‌కు కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. అలాగే తొమ్మిది దేశాల నుంచి హాంకాంగ్‌కు వచ్చేవారందరికీ కరోనా నెటిగెటివ్‌ రిపోర్టులు ఉన్నాయని విమానయాన సంస్థ ఫ్లైట్‌ బయలుదేరే ముందు సంబంధిత ఫారాన్ని సమర్పించాలని సూచించింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి విమాన సర్వీసులు నిలిపి వేశారు. అయితే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ మిషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo