గురువారం 09 ఏప్రిల్ 2020
International - Mar 21, 2020 , 13:30:40

స్టే ఎట్ హౌమ్‌.. అమెరికాలో తీవ్ర ఆంక్ష‌లు

స్టే ఎట్ హౌమ్‌.. అమెరికాలో తీవ్ర ఆంక్ష‌లు

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అమెరికా తీవ్ర ఆంక్ష‌లు జారీ చేసింది.  ఆ దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్ప‌టికే పౌరుల‌కు ఆదేశాలు ఇచ్చాయి.  ఇండ్లు విడిచి బ‌య‌ట‌కు రావొద్దు అని ఆదేశించాయి.  ఈ ఆదేశాల ప్ర‌కారం క‌నీసం అయిదుగురిలో ఒక‌రు మాత్రం ఇంటికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. క‌న‌క్టిక‌ట్‌, న్యూజెర్సీ, ఇలియ‌నాస్‌, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలు ఇప్ప‌టికే నిషేధం ఆజ్ఞ‌లు జారీ చేశాయి. నిత్యావ‌స‌రాల‌కు సంబంధంలేని వ్యాపారాల‌ను మూసివేయాల‌ని న్యూయార్క్ రాష్ట్రం ఆదేశాలు ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల అమెరికాలో 230 మంది చ‌నిపోయారు. సుమారు 20 వేల మందికి సోకింది.  

ఇక ఆ దేశానికి చెందిన మ్యూజిక్ స్టార్ కెన్నీ రోజ‌ర్స్ 81 ఏళ్ల వ‌య‌సులో క‌న్నుమూశారు. ఆయ‌న స‌హ‌జ‌మ‌ర‌ణం పొందిన‌ట్లు పేర్కొన్నారు.  అనేక జాన‌ప‌ద గీతాల‌కు ఆయ‌న బాణీలు కూర్చారు. 1970, 80 ద‌శ‌కాల్లో అనేక పాప్ గీతాలు ఆల‌పించారు. మూడుసార్లు గ్రామీ అవార్డులు ఆయ‌న గెలుచుకున్నారు.

 


logo