శనివారం 30 మే 2020
International - Apr 14, 2020 , 12:46:37

న్యూయార్క్‌లో ప్రతి 100 మందిలో ఒకరికి కరోనా

న్యూయార్క్‌లో ప్రతి 100 మందిలో ఒకరికి కరోనా

న్యూయార్క్‌: క‌రోనా మ‌హ‌మ్మారితో అగ్ర‌రాజ్యం అమెరికా వ‌ణికిపోతుంది. ప్ర‌పంచానికే పెద్ద‌న్న‌గా భావించే అమెరికాను క‌రోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా  ప్రపంచంలో ఎంతో మంది యంగ్ టాలెంటీర్స్‌కి కలల ప్రపంచంగా ఉన్న న్యూయార్క్ న‌గ‌రం క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకుల వ‌ణికిపోతుంది. ఎంత‌లా అంటే.. ఆస్పత్రుల మార్చురీలన్నీ మృతదేహాలతో నిండిపోవడంతో... తాజాగా చనిపోతున్న వారిని ఎక్కడ ఉంచాలో కూడా అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ఇప్పుడు ప్రపంచంలో మరే దేశంలో నమోదు కానన్ని కేసులు ... ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఉన్నాయి. అమెరికాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 40 శాతం ఒక్క న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 5,86,941 కేసులు ఉండగా... న్యూయార్క్‌లో 1,95,655 ఉన్నాయి. అమెరికాలో మృతుల సంఖ్య 23,640గా ఉండగా... న్యూయార్క్‌లో 10,056 ఉన్నాయి. 2019 లెక్కల ప్రకారం న్యూయార్క్ జనభా 1.94 కోట్లు కాగా... న్యూయార్క్‌లోని ప్రతీ 100 మందిలో ఒకరికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. స్పెయిన్ లాంటి అత్యధిక కేసులున్న దేశంలో కూడా ఇంత తీవ్రమైన పరిస్థితి రాలేదు.


logo