బుధవారం 03 జూన్ 2020
International - Apr 10, 2020 , 00:57:59

100 మంది వైద్యులు బలి

100 మంది  వైద్యులు బలి

  • ఇటలీలో వైరస్‌ విలయతాండవం
  • మధ్యప్రదేశ్‌లో కరోనా డాక్టర్‌ మృతి

రోమ్‌: ఇటలీలో వైరస్‌ బారినపడి వంద మందికిపైగా డాక్టర్లు మృత్యువాతపడ్డారు. కరోనా రోగులకు వైద్య సహాయం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పలువురు ప్రభుత్వ మాజీ వైద్యులు కూడా ఇందులో ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థల సంఘం పేర్కొంది. దేశవ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందిలో పది శాతం మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేసింది. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోమనడం దారుణమని సంఘం అధ్యక్షుడు ఫిలిప్పో వ్యాఖ్యానించారు.


logo