గురువారం 28 జనవరి 2021
International - Dec 05, 2020 , 07:57:34

సైనిక స్థావరంలో పేలిన బాంబు.. ఒకరి మృతి

సైనిక స్థావరంలో పేలిన బాంబు.. ఒకరి మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరిగిన బాంబు దాడిలో ఓ వ్యక్తి మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పాక్‌ సైనిక స్థావరమై రావల్పిండిలోని బస్‌ టెర్మినల్‌ సమీపంలో నిన్న రాత్రి టైం బాంబు పేలిందని పోలీసులు తెలిపారు. రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉన్న రావల్పిండి.. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి.

బస్‌ టెర్నినల్‌ సమీపంలో రిక్షాలో అమర్చిన టైం బాంబు పేలిందని, దీంతో ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించామని చెప్పారు. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదన్నారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఉగ్రవాద కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

కాగా, పటిష్ట భద్రత నడుమ ఉంటే రావల్పిండిలో 2015 తర్వాత బాంబు దాడి జరగడం ఇదే మొదటిసారి. గత జూన్‌ నెలలో రావల్పిండిలోని ప్రముఖ మార్కెట్‌ సమీపంలో బాంబు దాడి జరిగింది. ఇందులో ఒకరు మరణించగా, 12 మందికిపైగా గాయపడ్డారు.  


logo