గురువారం 28 మే 2020
International - May 07, 2020 , 10:00:53

జూమ్ యాప్ పై.. సీఈఓ వివరణ

 జూమ్ యాప్ పై.. సీఈఓ వివరణ

జూమ్ యాప్ పై వ‌స్తున్నఆరోప‌ణ‌ల‌పై.. జూమ్  సీఈఓ వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో చాలా వ‌ర‌కు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండ‌గా.. దీంతో స్కైప్, జూమ్  యాప్‌ లలో వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని వినియోగించుకుంటున్నారు. ఈ తరుణంలో జూమ్ యాప్ భ‌ద్ర‌త కాద‌ని భారత ప్రభుత్వం హెచ్చరించింది. దాంతో ఈ యాప్ ను ఉపయోగించించడం తగ్గించేశారు.. ఈ యాప్ చైనాకు చెందినదని.. ఇది వాడటం వలన వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లకు జూమ్ యాప్ సీఈఓ ఎరిక్ యువాన్ వివరణ ఇచ్చారు.. తన కంపెనీ అమెరికన్ అని చైనీస్ కాదని ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.  జూమ్ యాప్ నకు చైనాతో లింక్ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు యువాన్ పేర్కొన్నారు. జూమ్ ఒక అమెరికాకు చెందిన కంపెనీ అని కాలిఫోర్నియాలోఎస్టాబ్లిస్ చేసినట్లు వివ‌రించారు. జూమ్‌కు చైనాలోని ఇత‌ర‌ కంపెనీల‌కు ఉన్న‌ట్లు ఉద్యోగులు త‌మ‌కు ఉన్నారని యువాన్ చెప్పారు.


logo