మంగళవారం 31 మార్చి 2020
International - Mar 17, 2020 , 18:53:23

ఇరాన్‌లో 254 మంది ఇండియన్స్‌కు కరోనా పాజిటివ్‌..

ఇరాన్‌లో 254 మంది ఇండియన్స్‌కు  కరోనా పాజిటివ్‌..

న్యూఢిల్లీ:  ఇరాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శరవేగంగా కరోనా వ్యాపిస్తుండటంతో మంగళవారం కోవిడ్‌-19 కొత్త కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 1,178మందికి వైరస్‌ సోకగా..135 మంది మరణించారు. మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 16,169కి చేరింది. మహమ్మారి వల్ల మృతి చెందిన వారి   సంఖ్య 989కు పెరిగింది.   కరోనా బాధితుల్లో భారతీయులు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇరాన్‌లో  సుమారు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు అక్కడున్న ఇండియన్స్‌ వివరాలను  షేర్‌ చేశారు. 

విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం విదేశాంగశాఖ హెల్ప్‌లైన్లను ప్రారంభించింది.  కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న ఇరాన్‌ నుంచి మరో 53 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో సోమవారం ఢిల్లీకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీరందరినీ సైన్యానికి చెందిన క్వారంటైన్‌ శిబిరానికి తరలించారు. logo
>>>>>>