శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 23:17:46

వైట్‌హౌస్ ముందు బైడెన్‌కు తొలి అప‌శృతి!

వైట్‌హౌస్ ముందు బైడెన్‌కు తొలి అప‌శృతి!

వాషింగ్ట‌న్‌: అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసిన జో బైడెన్‌, ప్ర‌థ‌మ మ‌హిళ జిల్‌.. అధికారిక నివాసం.. వైట్‌హౌస్‌కు వెళ్లిన‌ప్పుడు కొద్దిసేపు బ‌యటే నిల‌బ‌డాల్సి వ‌చ్చింది. వైట్ హౌస్ తెరుచుకునే వ‌ర‌కు ఒక నిమిషం పాటు బ‌య‌టే బైడెన్ తన స‌తీమ‌ణి జిల్‌ను ఆలింగనం చేసుకున్న ద్రుశ్యాల వీడియోలు వెలుగు చూశాయి.  ఇది పెద్ద ప్రోటోకాల్ ఉల్లంఘ‌న అని సిబ్బంది చెవులు కొరుక్కున్నారు. సాధార‌ణంగా బైడెన్ దంప‌తుల‌కు  ట్రంప్ స్వాగ‌తం ప‌లుకాల్సి ఉంటుంది. త‌న స‌తీమ‌ణి మెలానియాతో క‌లిసి ముందే శ్వేత‌సౌధాన్ని వీడారు.

బైడెన్ దంప‌తుల‌కు మెరైన్ గార్డ్స్ త‌లుపులు తెరిచి స్వాగ‌తం ప‌లుకాలి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌మిని జీర్ణించుకోలేని డొనాల్డ్ ట్రంప్‌.. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు.  ఈ వ్య‌వ‌హారాన్ని ప‌ర్య‌వేక్షించే చీఫ్ తిమోథీ హార్లెత్‌ను తొలిగించి మ‌రి ట్రంప్ శ్వేత‌సౌధాన్ని వీడారు. దీంతో వైట్ హౌస్ తలుపులను తెరిచే యూజ‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసేవారు లేక‌పోయారు. వైట్‌హౌస్ అధికారి ఒక‌రు మాట్లాడుతూ.. ఇది సిబ్బంది పొర‌పాటు అని పేర్కొన్నారు. ఈ విష‌య‌మై బైడెన్ సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల్సింద‌ని అభిప్రాయ ప‌డ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo