మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 15, 2020 , 12:03:07

పాక్‌ విమానాలపై ఒమన్‌ నిషేధం

పాక్‌ విమానాలపై ఒమన్‌ నిషేధం

ఇస్లామాబాద్‌: తమ గగనతలం మీదుగా పాక్‌ విమానాలు రాకపోకలు సాగించడంపై ఒమ‌న్‌ నిషేధం విధించింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)లో పనిచేస్తున్నవారిలో చాలా మందివి నకిలీ సర్టిఫికెట్లని ఆరోపణలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. నకిలీ డిగ్రీల ఆరోపణలపై పాక్‌లో ఒమన్‌ అధికారులు విచారణ జరిపారు. అందులో మే 23న కరాచి విమానశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదానికి నకిలీ సర్టిఫికెట్లు కలిగిన పైలట్లే కారణమని తేలింది. దీంతో పీఐఏపై ఒమన్‌ నిషేధం విధించింది. 

పాక్‌ పైలట్లలో మూడో వంతు మంది దగ్గర నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తేలడంతో ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ ఎయిర్‌ సేఫ్టీ ఏజెన్సీ ఈయూ ఆరు నెలలపాటు పీఐఏ విమానాలపై నిషేధించింది. ఇవే ఆరోపణలపై అమెరికా కూడా పాక్‌ అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.    

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌లో 150 మంది పైలట్లు నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి గులామ్ సర్వార్‌ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌ విమానాలపై ఒక్కో దేశం నిషేధం విధిస్తున్నాయి.


logo