గురువారం 21 జనవరి 2021
International - Dec 23, 2020 , 02:07:02

పార్టీ చైర్మన్‌గా ఓలీ ఔట్‌

పార్టీ చైర్మన్‌గా ఓలీ ఔట్‌

కఠ్మండు: నేపాల్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్సీపీ) కేంద్ర కమిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఓలీని ఎన్సీపీ చైర్మన్‌ పదవి నుంచి తొలిగిస్తున్నట్టు మంగళవారం ప్రచండ ప్రకటించారు. ఓలీ స్థానంలో పార్టీ మరో సీనియర్‌ నేత మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ను ఎన్నుకుంటూ కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

తాజావార్తలు


logo