గురువారం 28 మే 2020
International - May 22, 2020 , 02:06:23

గెలాక్సీల పెద్దన్న ‘వోల్ఫ్‌ డిస్క్‌'

గెలాక్సీల పెద్దన్న ‘వోల్ఫ్‌ డిస్క్‌'

అత్యంత పురాతనమైన.. మనకు అత్యంత దూరంలో ఉన్న పాల పుంతను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది విశ్వం ఆవిర్భవించిన తర్వాత 1500 కోట్ల ఏండ్లకు ఏర్పడినట్లు భావిస్తున్నారు. చిలీలోని ఆల్మా టెలిస్కోపు సహాయంతో దీనిని కనుగొన్నారు. ‘వోల్ఫ్‌ డిస్క్‌' అని పేరు పెట్టారు. ఇది భూమికి 1,230 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. తన కక్ష్యలో సెకనుకు 272 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నది. ఈ పాలపుంత గుండ్రంగా ఉండటం శాస్త్రవేత్తలను విస్మయా నికి గురిచేస్తున్నది. విశ్వంలోని ఇతర పాలపుంతలు దాదాపు గుండ్రంగా ఉన్నా.. అవి ఆ రూపునకు రావడానికి కొన్ని వందల కోట్ల ఏండ్లు పట్టింది. అయితే వోల్ఫ్‌ డిస్క్‌ మాత్రం ఏర్పడిన సమయం నుంచే గుండ్రగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వం ఆరంభంలో గెలక్సీలు ఎలా ఉంటాయన్న అంశంలో పరిశోధనలకు వోల్ఫ్‌ డిస్క్‌ మరిన్ని సవాళ్లు విసురుతున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  


logo