ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Sep 22, 2020 , 22:13:30

డిమెన్షియాతో బాధపడుతున్నా చక్కగా పియానో వాయించాడు..!

డిమెన్షియాతో బాధపడుతున్నా చక్కగా పియానో వాయించాడు..!

హైదరాబాద్‌: డిమెన్షియా ఒక వ్యాధి కాదు. అది ఒక మెడికల్ కండిషన్. జ్ఞాపక శక్తి పోవడం, భాష మర్చిపోవడం, ఆలోచించలేకపోవడం, చెప్పింది అర్ధం చేసుకోలేకపోవడం దీని లక్షణాలు. వృద్ధుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిబారినపడ్డవారు కోలుకోవడం కష్టమే. అయితే, ఈ రుగ్మతతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తన కొడుకు ఇచ్చిన నోట్స్‌ను పియానోపై ప్లే చేసి, శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించాడు. అతడి కొడుకు ఇదంతా వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టగా నెటిజన్ల మనసు గెలుచుకుంది. 

నిక్ హార్వే ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో అతని తండ్రి పియానో వాయిస్తున్నాడు. అతడు డిమెన్షియా రుగ్మతతో బాధపడుతున్నాడని, కానీ తాను ఇచ్చిన నోట్స్‌ ఆధారంగా చక్కగా పియానో ప్లే చేశాడని హార్వే పేర్కొన్నాడు. తన తండ్రి సామర్థ్యం ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.  అతడి చిత్తవైకల్యం మరింత తీవ్రమవుతున్నప్పటికీ, ఇలాంటి సందర్భాలు అతడిని మామూలు మనిషిని చేస్తున్నాయి అని నిక్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియోను ఊహించనివిధంగా 1.5 మిలియన్లకు పైగా వీక్షించారు. 57,000 మంది లైక్‌ చేశారు. నిక్ తండ్రి పియానో ​​వాయించడం చూసి చాలా మంది నెటిజన్లు ఆనందం వ్యక్తంచేయగా, మరికొందరు తమ ప్రియమైనవారి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo