జపాన్‌కు చెందిన ఈ కవలల పేర్లు… ఉమెనొ సుమియామ, కౌమె కొడామ. వీరి వయసు 107 సంవత్సరాల 330 రోజులు. వీరిని ప్రపంచంలో అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు సోమవారం ధ్రువీకరించింది. జపాన్‌లో వయోధికుల గౌరవ దినోత్సవం రోజే ఈ ప్రకటన వెలువడటం విశేషం.