శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 16, 2020 , 17:47:44

ఓక్ల‌హామా గ‌వ‌ర్న‌ర్‌ కెవిన్ స్టిట్‌కు క‌రోనా‌

ఓక్ల‌హామా గ‌వ‌ర్న‌ర్‌ కెవిన్ స్టిట్‌కు క‌రోనా‌

న్యూఢిల్లీ: అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. ఇప్ప‌టికే ఆ దేశంలో 36 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. ల‌క్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓక్లహోమా రాష్ట్ర గవర్నర్ కెవిన్ స్టిట్‌కు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీకి హాజరైన రెండువారాల తర్వాత ప‌రీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చింద‌ని కెవిన్ బుధవారం ప్రకటించారు. 

కాగా, అమెరికాలో కరోనా పాజిటివ్ వ‌చ్చిన తొలి గవర్నర్ తానేన‌ని కెవిన్ స్టిట్ తెలిపారు. వైర‌స్ నిర్ధార‌ణ కావ‌డంతో 47 ఏండ్ల కెవిన్ కుటుంబానికి దూరంగా క్వారెంటైన్‌లో ఉన్నారు. వైరస్ నుంచి విముక్తి పొందే వరకు ఇంటి నుంచే పనిచేస్తానని చెప్పారు. క‌రోనా వైరస్ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo