శనివారం 30 మే 2020
International - Apr 22, 2020 , 14:58:31

ధర తగ్గిన చమురు.. ఓడలు, రైళ్లు, గనుల్లో నిల్వ

ధర తగ్గిన చమురు.. ఓడలు, రైళ్లు, గనుల్లో నిల్వ

హైదరాబాద్: కరోనా కల్లోలం వల్ల అంతర్జాతీయంగా చమురు డిమాండ్ అడుగంటిపోయింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద వినియోగదారు అయిన ఇండియాలో చమురు వినియోగం 70 శాతం తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ చమురు ధర దారుణంగా పడిపోయింది. ఇది కొందరు వ్యాపారులకు మంచి అవకాశంగా కనిపిస్తున్నది. తక్కువ ధరకు కొని నిల్వ చేసి ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్మాలని వారు పరుగులు పెడుతున్నారు. దీంతో భూమి మీద నిల్వచేసే ట్యాంకులకు డిమాండ్ పెరిగింది. అవి కూడా అయిపోవడంతో ఆయిల్ ట్యాంకర్ ఓడల వెంట పడుతున్నారు. కొందరు రైల్వే ట్యాంకర్లు కూడా వదిలిపెట్టడం లేదు. ఒక్కొక్కరు డజన్ల సంఖ్యలో ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో 3 కోట్ల బ్యారెళ్ల జెట్ ఇంధనం, పెట్రోల్, డీజిల్ సముద్రంలో తిరిగే ట్యాంకర్లలో నిల్వచేసినట్టు తెలుస్తున్నది. ఈ సరికే 13 కోట్ల బ్యారెళ్ల చమురు సముద్రంలోని ట్యాంకర్లలో నిల్వ ఉన్నది. స్వీడన్ తదితర స్కాండినేవియా దేశాల్లో ఉప్పురాయి గనుల్లో సైతం చమురు నిల్వచేస్తున్నారంటే పరిస్థితిని అర్థ చేసుకోవచ్చు. అవకాశమున్న ప్రతిచోటా చమురు దాచేందుకు ప్రపంచమంతటా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.


logo