శనివారం 06 జూన్ 2020
International - Apr 28, 2020 , 17:33:11

వీడియో కాన్ఫరెన్స్‌లో వింతగా ప్రవర్తించిన అధికారి

వీడియో కాన్ఫరెన్స్‌లో వింతగా ప్రవర్తించిన అధికారి

హైదరాబాద్: కరోనా వైరస్ లాక్ డౌన్ మనుషుల్లోని వింతవింత ప్రవర్తనల్ని బయటకు తెస్తున్నది. ఇందుకు అమెరికాలో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్సే సాక్ష్యం. కాలిఫోర్నియా రాష్ట్రంలోని వాలెజో నగర పాలక అధికారులు నగర ప్రణాళికా కమిషనర్ క్రిస్ ప్లాట్జర్‌తో ఇటీవల ఓ వీడియో సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్పరెన్సింగ్ యాప్  ఝూమ్‌లో నిర్వహించిన ఆ సమావేశంలో ఆయన బీరుతాగుతూ పాల్గొన్నారు. ప్రశ్నలకు తిక్కతిక్కగా సమాధానాలిచ్చారు. మధ్యలో ఆయన పెంపుడు పిల్లి సీన్‌లోకి వచ్చింది. ఆయన దానిని పైకెత్తి ఇదిగో నా పిల్లి అని చూపుతూ దానిని విసిరేశారు. అది వెల్లి థడ్ మని శబ్దం చేస్తూ కిందపడింది. ఆ దృశ్యం కనిపించకపోయినా శబ్దం వినిపించింది. వీడిటయో కాల్ ముగిసిన తర్వాత ఆయన బూతులు మాట్లాడారు. ఈ తతంగమంతా వీడియోలో రికార్డు చేసిన పైఅధికారులు దానిని తర్వాత నెట్‌లో విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఆ తలతిక్క అధికారిపై జనం మండిపడ్డారు. డ్యూటీలో మందు కొట్టడమా.. ఏమి ఈ అధికారి ధైర్యం అని ఒకరు కామెంట్ పెడితే పాపం ఆ పిల్లిని కాస్త మనసున్న మనిషికి అప్పగిస్తే బాగుండు అని మరో నెటిజెన్ ఆశించారు. ఈ వివాదం కారణంగా చివరకు ప్లాట్జర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన ప్రవర్తనకు లెంపలు కూడా వేసుకున్నారు. 'రోజులు అలా ఉన్నాయి. ఈ కొత్త పరిస్థితులకు సర్దుకోలేకపోతున్నాను' అని పాపం బాధపడ్డాడు కూడా.


logo