మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 13:08:41

కోళ్ల‌కోసం వెళ్లిన కోబ్రా వారి చేతిలో చిక్కుకుపోయింది!

కోళ్ల‌కోసం వెళ్లిన కోబ్రా వారి చేతిలో చిక్కుకుపోయింది!

కోళ్లు ఎక్క‌డైతే ఎక్కువ‌గా ఉంటాయో అక్క‌డ పాముల తాకిడి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఎవరూ లేని స‌మ‌యంలో వెళ్లి కోళ్ల‌‌కు గాల‌మేస్తాయి పాములు. ఒడిశాలోని పిపిలీలో ఐదు  అడుగుల నాగుపాము ఏకంగా  పౌల్ట్రీ‌ఫామ్‌లోకి దూరింది. త‌ల‌త‌లమంటూ ప‌సుపు వ‌ర్ణంలో మెరిసిపోతున్న పామును చూసి అక్క‌డ సిబ్బంది హ‌డ‌లిపోయారు. త‌మ‌తోపాటు, కోళ్ళ‌ను కాపాడుకునేందుకు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేశారు. వారు అక్క‌డికి చేరుకొని పామును ప‌ట్టుకున్నారు. అనంత‌రం పామును సుర‌క్షితంగా అడ‌విలో వ‌దిలిపెట్టారు. 


logo