సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 02, 2020 , 01:30:02

చట్టాలను పాటించం

చట్టాలను పాటించం

న్యూయార్క్‌:  అంగారక గ్రహానికి సంబంధించిన ప్రయోగాలపై అంతర్జాతీయ చట్టాలను పాటించబోమని ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌' స్పష్టంచేసింది. తాము రూపొందించుకున్న సొంత చట్టాలనే పాటించబోతున్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడానికి ‘స్టార్‌లింక్‌' శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లో భాగంగా స్పేస్‌ఎక్స్‌ 800కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించింది. మార్స్‌పై చేపట్టనున్న ప్రయోగాల కోసం ‘స్టార్‌లింక్‌' ఒప్పందంలో కొన్ని మార్పులు చేసింది.