సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 02:59:39

ఊబకాయులకు కరోనా ప్రాణాంతకం!

ఊబకాయులకు కరోనా ప్రాణాంతకం!

లండన్‌, జూలై 25: అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నవారికి కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదమున్నదని బ్రిటన్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తీవ్రతను తగ్గించాలంటే.. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బ్రిటన్‌ ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి చెందిన ‘పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌' (పీహెచ్‌ఈ) శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అధిక బరువు ఉన్నవారు దవాఖాన, ఐసీయూ పాలయ్యే ప్రమాదం అధికమని, అలాగే కొవిడ్‌ వారికి ప్రాణాంతకం కావొచ్చని అందులో పేర్కొన్నారు. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) పెరిగేకొద్దీ కరోనా ముప్పు కూడా పెరుగుతుందని తెలిపారు. అధిక బరువున్నవారికి కరోనా ముప్పు అధికంగా ఉండడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పరిశోధకులు వివరించారు. బీఎంఐ 35-40 మధ్య ఉన్నవారికి కరోనా వల్ల ప్రాణముప్పు 40 శాతం ఎక్కువని, బీఎంఐ 40పైన ఉన్నవారికి 90 శాతం అధికమని పేర్కొన్నారు. 


logo