గురువారం 28 మే 2020
International - May 18, 2020 , 09:08:32

ఒబామా అసమర్థ అధ్యక్ష్యుడు... ట్రంప్‌

ఒబామా అసమర్థ అధ్యక్ష్యుడు... ట్రంప్‌

అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాజీ అమెరికా అధ్యక్ష్యుడు ఒబామాపై తిట్ల వర్షం కురిపించాడు. ఆదివారం అమెరికా అధ్యక్ష్య నివాసం వైట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ మాజీ అమెరికా అధ్యక్ష్యుడు బరాక్‌ ఒబామా తీవ్ర అసమర్థ అధ్యక్ష్యుడని మండిపడ్డారు. దీనికి కారణం శనివారం ఒబామా ఓ కార్యక్రమంలో కరోనా కట్టడిలో అమెరికా ప్రభుత్వ తీరును పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ఓ కాలేజి గ్రాడ్యుయేట్లతో వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న ఒబామా కరోనా మహమ్మారి అమెరికా నాయకత్వాన్ని బహిర్గతం చేసిందన్నారు. అన్నిటికి మించి భాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు తమ భాద్యతను ఏ విదంగ సమర్థంగా నిర్వహిస్తున్నారో చెప్పాలని పేరు చెప్పకుండా ప్రశ్నించారు. అలాగే కేవలం చాలా మంది భాద్యత వహిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. దీంతో అసలే చిరాకు ఎక్కువగా ఉండే ట్రంప్‌ ఒబామాను చేతగాని అధ్యక్ష్యుడంటూ కామెంట్‌ చేశారు.


logo