గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 11:13:05

బిడెన్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు

బిడెన్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు

హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. బిడెన్‌లో అధ్యక్షునికి కావాల్సిన లక్షణాలన్నీ ఈసరికే ఉన్నాయని ఒబామా పేర్కొన్నారు. ఆయన తనకు సన్నిహిత మిత్రుడని, సహనశీలి, దయాళువు అని ఒబామా ప్రశంసించారు. గతంలో రెండువిడతలు ఇద్దరూ కలిసి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు నిర్వహించారు. ఆరకంగా వారిద్దరికీ మధ్య చక్కటి మైత్రి ఉంది. బెర్నీ శాండర్స్‌ను ప్రైమరీల్లో ఓడించి డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న బిడెన్‌కు మద్దతుగా ఒబామా 12 నిమిషాల వీడియో ప్రసంగాన్ని విడుదల చేశారు. బిడెన్ తరఫున ఒబామా నిధుల సేకరణ కూడా జరుపుతారని తెలుస్తున్నది. బిడెన్ తన ప్రచారంలో ఒబామా అధ్యక్షతకు కొనసాగింపుగానే తన పాలన ఉంటుందని ప్రచారం చేసుకుంటున్నారు.


logo