శనివారం 06 జూన్ 2020
International - May 20, 2020 , 12:02:04

వారానికి 4 రోజులే ప‌నిదినాలు.. ఐడియా ఇచ్చిన ప్ర‌ధాని

వారానికి 4 రోజులే ప‌నిదినాలు.. ఐడియా ఇచ్చిన ప్ర‌ధాని


హైద‌రాబాద్‌: క‌రోనాతో ప్ర‌పంచ‌మే మారింది. జీవ‌న విధానం కొత్త రూపు సంత‌రించుకుంటోంది.  ప‌నిదినాల్లోనూ మార్పు కావాల‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి.  ఇక న్యూజిలాండ్‌లో అయితే నాలుగు రోజులే ప‌ని దినాలు ఉంటే బెట‌ర్ అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.  దీనిపై ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ కూడా ఓ కామెంట్ చేశారు.  వారానికి 4 రోజులే ప‌ని ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఓ ఐడియాను ప్ర‌జ‌ల‌కు ఆమె ప్ర‌జెంట్ చేశారు.  వీకెండ్‌ను కాస్తా పొడిగిస్తే, ఆ స‌మ‌యంలో కొంత సేద తీరే అవ‌కాశం ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చారు.  వారాంతపు సెల‌వులు పెరిగితే, అప్పుడు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు టూర్ చేసే అవ‌కాశం కూడా ఉంటంద‌ని ఆమె అన్నారు. దీంతో దేశ టూరిజం కూడా గాడిలో ప‌డుతుంద‌న్నారు.

ఫేస్‌బుక్ లైవ్ ఛాట్‌లో ఆమె ఈ ఓపీనియ‌న్ ఇచ్చారు. కానీ దీనిపై కంపెనీలు, వాటిల్లో ప‌నిచేసే ఉద్యోగుల మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఇది వీల‌వుతుంద‌న్నారు. కోవిడ్ స‌మ‌యంలో ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేశారు, ఆ స‌మ‌యంలో ఎంతో నేర్చుకున్నాం, ఉత్ప‌త్తి ప‌డిపోలేద‌న్నారు. ఉద్యోగాలు క‌ల్పించే కంపెనీలు ఈ ఐడియాపై దృష్టి పెట్టాల‌ని ఆమె స‌ల‌హాఇచ్చారు. న్యూజిలాండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల కేవ‌లం 21 మంది చ‌నిపోయారు.  


logo