ఆదివారం 31 మే 2020
International - Apr 07, 2020 , 15:33:39

నేనో ఇడియెట్ మంత్రిని..

నేనో ఇడియెట్ మంత్రిని..

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్‌కు చెందిన  ఆరోగ్య‌ శాఖ మంత్రి డేవిడ్ క్లార్క్‌ లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించారు. దానిపై ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డంతో.. ఆయ‌న త‌న‌ను తానే ఇడియ‌ట్‌ను అంటూ ప్ర‌క‌ట‌న చేశారు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించారు. అయితే ఆ నియ‌మావ‌ళిని మంత్రి డేవిడ్ క్లార్క్ ఉల్లంఘించారు.  ఆయ‌న త‌న ఫ్యామిలీతో క‌లిసి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బీచ్‌కు వెళ్లారు.  దీనిపై జనాగ్ర‌హం వెల్లువెత్తింది. లాక్‌డౌన్ రూల్స్ అతిక్ర‌మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  అయితే త‌న ప్ర‌వ‌ర్త‌న ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు మంత్రి త‌ప్పును ఒప్పుకున్నారు. నేనో ఇడియ‌ట్‌ను అంటూ త‌న‌ను తాను నిందించుకున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు  మంత్రి క్లార్క్ ప్ర‌క‌టించారు. దీనిపై ప్ర‌ధాని జెసిండా స్పందించారు.  క్యాబినెట్ ర్యాంక్‌లో మంత్రి హోదాను త‌గ్గిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.  


logo