e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home అంతర్జాతీయం నువ్వు ఒంట‌రి కాదు.. రోగులను ఉత్సాహ ప‌రుస్తూ న‌ర్సు పాట‌

నువ్వు ఒంట‌రి కాదు.. రోగులను ఉత్సాహ ప‌రుస్తూ న‌ర్సు పాట‌

నువ్వు ఒంట‌రి కాదు.. రోగులను ఉత్సాహ ప‌రుస్తూ న‌ర్సు పాట‌

ఒట్టావా: నువ్వు ఒంట‌రి కాదంటూ.. ఐసీయూలోని రోగుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ ఒక న‌ర్సు పాడిన పాట సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యింది. కెన‌డాలోని ఒట్టావా ఆసుప‌త్రిలో ప‌ని చేసే ఎండోస్కోపీ నర్సు అమీ-లిన్‌ను ఇటీవ‌ల తిరిగి ఐసీయూ వార్డులో నియ‌మించారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి రోగుల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు ఆమె ప్ర‌య‌త్నించారు. మాస్క్ ధ‌రించిన ఆమె గిటార్ వాయిస్తూ.. నువ్వు ఒంట‌రి కాదు.. అనే పాట పాడారు. ఈ వీడియోను ఆసుప‌త్రి యాజ‌మాన్యం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. రోగుల‌లో మనోదైర్యం నింపినందుకు ధన్య‌వాదాలు అని పేర్కొంది. స్ట్రాంగ‌ర్ టుగెద‌ర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జ‌త చేసింది.

మ‌రోవైపు ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. ఐసీయూలోని రోగుల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు న‌ర్సు అమీ చేసిన ప్ర‌య‌త్నాని నెటిజ‌న్లు కొనియాడారు. ఆమె సంగీతం, పాట బాగున్నాయ‌ని, రోగుల‌కు ఇది ఎంతో ఊర‌ట ఇచ్చి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నువ్వు ఒంట‌రి కాదు.. రోగులను ఉత్సాహ ప‌రుస్తూ న‌ర్సు పాట‌

ట్రెండింగ్‌

Advertisement