బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 12, 2020 , 09:18:53

ఎనిమిది మంది చిన్నారుల‌ను చంపిన న‌ర్సు

ఎనిమిది మంది చిన్నారుల‌ను చంపిన న‌ర్సు

లండ‌న్‌:  పురుడు పోయాల్సిన న‌ర్సు.. అప్పుడే పుట్టిన చిన్నారుల‌ను చిదిమేసింది. ఆమె ప‌నిచేస్తున్న ద‌వాఖాన‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిదిమంది న‌వ‌జాత శిశువుల‌ను చంపింది. మ‌రో ప‌ది మంది చిన్నారుల ప్రాణాల‌ను తీయ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆఖ‌రుకు పోలీసుల‌కు దొరికిపోయి ఊచ‌లు లెక్క‌బెడుతున్న‌ది. ‌

ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్ట‌ర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న ఓ స్థానిక ద‌వాఖాన‌లో లూసీ లెట్ బే అనే న‌ర్సు ప‌నిచేస్తున్న‌ది. ద‌వాఖాన‌లో అప్పుడే పుట్టిన చిన్నారుల‌ను చంపేస్తున్న‌ద‌నే అభియోగాల‌పై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2015, జూన్ నుంచి 2016 జూన్ వ‌ర‌కు కౌంటెస్ ఆఫ్‌ చెస్ట‌ర్ ద‌వాఖాన‌లోని నియోన‌ట‌ల్ యూనిట్‌లో ఎనిమి‌ది మంది చిన్నారుల‌ను చంపేసింద‌ని, మ‌రో ప‌ది మంది శిశువులపై హ‌త్యాయ‌త్నం చేసింద‌ని తెలిపారు. ఆమెను ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రుచ‌నున్నారు. గ‌తంలో 2018, 2019లోకూడా ఇవే ఆరోప‌ణ‌ల‌పై ఆ న‌ర్సును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆరోప‌ణ‌లు రుజువుకాక‌పోవ‌డంతో ఆమెను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.