బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 15, 2020 , 15:04:37

భారత్‌లో 107కు చేరిన కరోనా కేసులు

భారత్‌లో 107కు చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కేసులు భారత్‌లో కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఆదివారం మధ్యాహ్నం వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 107కు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  కొత్తగా 14మందికి వైరస్‌ సోకడంతో భారత్‌లో కరోనా కేసులు 107కు చేరింది. కొత్తగా  వ్యాధి బారిన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు 31 మహారాష్ట్రలో నమోదయ్యాయి. 

అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,760 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ సోకిన వారి సంఖ్య 1.5లక్షలు దాటింది. చైనాలో  ఇప్పటి వరకు 80,824 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 3,189మంది మరణించగా.. 65,541 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.    ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, హరియాణా రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలలకు  సెలవులు ప్రకటించాయి. 


logo
>>>>>>