శనివారం 04 జూలై 2020
International - May 26, 2020 , 20:25:36

గల్ఫ్‌ ఎన్నారైలకు ఉచిత క్వరంటైన్‌పై ఎన్నారై సౌత్‌ ఆఫ్రికా హర్షం...

గల్ఫ్‌ ఎన్నారైలకు ఉచిత క్వరంటైన్‌పై ఎన్నారై సౌత్‌ ఆఫ్రికా హర్షం...

సీఎం కేసీఆర్‌తో మహేష్‌ బిగాల

సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేష్‌ బిగాలకు, టీఆరెస్‌ ఎన్నారై గల్ఫ్‌ శాఖల ప్రతినిధులకు టీఆరెస్‌ ఎన్నారై సౌత్‌ ఆఫ్రికా శాఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే నిరుపేద కార్మికులు, డబ్బులు చెల్లించలేని వారికోసం ప్రభుత్వం ఉచిత క్వరంటైన్‌ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఉచిత క్వారంటాయిన్‌ సెంటర్లలో వారికి భోజనం, వసతి ఉచితంగా అందించడంపట్ల టీఆరెస్‌ ఎన్నారై సౌత్‌ ఆఫ్రికా శాఖ అధ్యక్ష్యులు నాగరాజు గుర్రాల హర్షం వ్యక్తం చేశారు. 

సౌత్‌ ఆఫ్రికాలోనూ చిక్కుకపోయిన తెలంగాణ వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళకి కావలసిన ఏర్పాట్లను మహేష్‌ బిగాల స్వయంగా తెలుసుకున్నందుకు నాగరాజు గుర్రాల మహేష్‌ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగోలో హైదరాబాద్‌ నివాసి అర్జెంటుగా మెడికేషన్‌ అవసరం ఉంటే సౌత్‌ ఆఫ్రికా నుంచి ఏర్పాటు చేసారన్నారు. ఇలా కోవిద్‌ 19 లో ఎన్నో సమస్యలని తెరాస ఎన్‌ఆర్‌ఐ శాఖల ద్వారా మహేష్‌ బిగాల కోఆర్డినేట్‌ చేశారన్నారు. వివిధ దేశాలో ఈ క్వరంటైన్‌ విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్న  పార్టీ సహచరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాగరాజు.logo