బుధవారం 03 జూన్ 2020
International - Apr 08, 2020 , 11:13:38

అమెరికాలో ఎన్నారై కంపెనీ దాతృత్వం

అమెరికాలో ఎన్నారై కంపెనీ దాతృత్వం

హైదరాబాద్: అమెరికాకు భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే మలేరియా మందును పెద్దఎత్తున సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని కరోనా చికిత్సకు వాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. మరణఘోష ఎటూ ఆగడం లేదు. వాడితే పోయేదేముంది అనేది ఆయన వాదన. ఆయన చేపట్టిన కృషికి మద్దతుగా న్యూజెర్సీకి చెందిన ఓ ప్రముఖ ఎన్నారై కంపెనీ అమ్నీల్ 34 లక్షల మాత్రలను ప్రభావిత రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నది. చిరాగ్‌పటేల్, చింతూపటేల్ అనే ఎన్నారై సోదరులు ఈ కంపెనీ యజమానులు. వీరు వారం, పదిరోజుల్లో మరో 2 కోట్ల మాత్రల తయారీకి నడుం బిగిస్తున్నారు. అమ్నీల్ కంపెనీ న్యూయార్క్ కు 20 లక్షలు, టెక్సాస్ కు 10 లక్షలు, లూసియానాకు 4 లక్షల మాత్రలు ఉచితంగా పంపింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో అందరం కలిసి కృషి చేయడం అవసరమని అమ్నీల్ కంపెనీ జంట సీఈవోలైన పటేల్స్ పేర్కొన్నారు. 


logo