మంగళవారం 31 మార్చి 2020
International - Feb 28, 2020 , 18:04:14

క‌న్నీటి చుక్క‌ల్లోనూ క‌రోనా..

క‌న్నీటి చుక్క‌ల్లోనూ క‌రోనా..

హైద‌రాబాద్‌:  కేవ‌లం ఊపిరితిత్తులోనే కాదు.. క‌న్నీటి చుక్క‌ల్లోనూ క‌రోనా వైర‌స్ క‌నిపిస్తోంద‌ట‌.  చైనాలోని జీజియాంగ్ వ‌ర్సిటీకి చెందిన హాస్ప‌ట‌ల్ తాజాగా ఓ నివేదిక‌ను రిలీజ్ చేసింది.  కరోనా వైర‌స్ సోకిన పేషెంట్ల‌పై .. డాక్ట‌ర్లు అనేక ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  ఆ స్ట‌డీని ప‌రిశోధ‌కులు ప‌బ్లిష్ చేశారు. క‌న్నీటి చుక్క‌ల‌తో పాటు కండ్ల నుంచి వ‌చ్చే ఇత‌ర ద్ర‌వాల్లోనూ క‌రోనా వైర‌స్ ఛాయ‌లు ఉన్న‌ట్లు తేల్చారు.  కోవిడ్‌19 వ్యాధి సోకిన సుమారు 30 మంది రోగుల‌ను ఆ వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ప‌రీక్షించారు.  రోగుల‌ క‌న్నీటి చుక్క‌లు, కండ్ల‌క‌ల‌కల్లోనూ వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధారించారు. క‌రోనా వైర‌స్ కేవ‌లం ఊపిరితిత్తుల‌కే కాకుండా, ఇత‌ర శ‌రీర భాగాల ద్వారా కూడా వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.  అయితే వైద్య సేవ‌లు అందించే వ‌ర్క‌ర్లు కేవ‌లం మాస్క్‌లు మాత్ర‌మే కాదు, కంటి అద్దాలు కూడా ధ‌రించాల్సి ఉంటుంద‌ని ఆ నివేదిక ప‌రిశోధ‌కుడు షెన్ యే తెలిపారు.  మాన‌వ శ‌రీరం దాటిన క‌రోనా వైర‌స్‌.. ఏవైనా వ‌స్తువుల‌పై సుమారు రెండు నుంచి అయిదు రోజుల వ‌ర‌కు బ్ర‌తికే అవకాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. logo
>>>>>>