శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 07, 2021 , 16:51:14

'నథింగ్ విల్ స్టాప్ అజ్‌' అని ట్వీట్ చేసింది.. కాల్పుల్లో చనిపోయింది.

'నథింగ్ విల్ స్టాప్ అజ్‌' అని ట్వీట్ చేసింది.. కాల్పుల్లో చనిపోయింది.

లాస్ ఏంజిల్స్: డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కాపిట‌ల్‌పై దాడి చేయడంతో అమెరికా పతాక శీర్షికలో నిలిచింది. నిరసనకారులు కాపిటల్‌లోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసుల కాల్పుల్లో నలుగురు చనిపోగా.. పెద్ద సంఖ్యలో ట్రంప్‌ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కాల్పుల్లో అష్లీ బాబిట్ అనే మహిళ చనిపోయారు. 

కాల్పులు జరుగడానికి ముందు ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజెన్స్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ప్రాంతానికి చెందిన అష్లీ బాబిట్ 14 సంవత్సరాలపాటు యూఎస్ వైమానిక దళంలో సేవలందించారని శాన్ డియాగో టీవీ స్టేషన్ తెలిపింది. మృతురాలు బాబిట్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌కు బలమైన మద్దతుదారు అని ఆమె భర్త తెలిపారు. కాపిటల్‌ భవనం వద్ద పెద్ద ఎత్తున ట్రంప్‌ మద్దతుదారులు గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది. ఇదే సమయంలో ఆమె ఒక వీడియోను చిత్రీకరించి ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. 'నథింగ్ విల్ స్టాప్ అజ్‌' అని ట్వీట్ చేసిన అనంతరం ప్రధాన గేటు వద్ద జరిపిన కాల్పులో బాబిట్‌ తీవ్రంగా గాయపడి కొద్దిసేపటికే మరణించింది. ఆమె మరణాన్ని వాషింగ్టన్‌ పోలీసులు కూడా ధ్రువీకరించారు. 

ఇవి కూడా చదవండి..

ఇదే, మన నిద్రపోని నగరం.. ఏదో తెలుసా?

2021.. టెక్నాలజీ నామ సంవత్సరమే.. ఎందుకంటే!

భూమి వేగంగా తిరుగుతోంది.. ఎందుకంటే..?

మెడల్ని విరిచేసిన తుమ్ము.. ఏమైందంటే..?

బడ్జెట్‌లో ముందుకు రానున్న కొత్త బ్యాంకు

తిరిగి ఇందిరమ్మ చేతిలోకి అధికారం

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo