బుధవారం 03 జూన్ 2020
International - Apr 15, 2020 , 10:17:15

డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపేసేందుకు సరైన సమయం కాదు

డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపేసేందుకు సరైన సమయం కాదు

హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు నిధులు నిలిపివేయడానికి ఇది తరుణం కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి విషయంలో డబ్ల్యూహెచ్‌వో వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిదులను నిలిపివేసిన నేపథ్యంలో గుటెరెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్‌పై పోరాడుతున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో లేదా మరే ఇతర మానవీయ సేవల సంస్థకు నిధులు నిలిపివేయడం మంచిదికాదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైరస్‌ను, దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు సంఘటితంగా పోరాడాల్సి ఉందని అన్నారు. సకాలంలో హెచ్చరించలేదని్, సైరన సలహాలు ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబ్ల్యూహెచ్‌వోపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే సరైన సమయంలో ఆయన స్పందించలేకపోయారని అమెరికా మీడియాలో ట్రంప్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన డబ్ల్యూహెచ్‌వోపై విరుచుకుపడడం గమనార్హం.


logo