శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 16:08:29

చెట్టు మీద చిక్కుకున్న పిల్లిని కాపాడేందుకు ఊరంతా క‌దిలొచ్చింది ఎక్కడంటే..!

చెట్టు మీద చిక్కుకున్న పిల్లిని కాపాడేందుకు ఊరంతా క‌దిలొచ్చింది ఎక్కడంటే..!

ఇది విని జోక్ అనుకునేరు! నిజం. ఒక పిల్లిని కాపాడేందుకు ఆ ప‌ట్ట‌ణం అంతా క‌దిలొచ్చింది. 40 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు మీద నాలుగు రోజుల పాటు తిండి తిప్ప‌లు లేకుండా ఉన్న పిల్లిని ఓ ప‌ట్ట‌ణం కాపాడింది. ఏపీ స్కాఫ్‌ఫోల్డింగ్ స‌ర్వీసెస్ ఈ విష‌యం గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. నాలుగు రోజులు ప్ర‌య‌త్నించి చివ‌రికి పిల్లిని ర‌క్షించామ‌ని, పిల్లి త‌మ య‌జ‌మానుల వ‌ద్ద‌కు వెళ్లింద‌ని వెల్ల‌డించారు.  ఆగ్నేయ వేల్స్‌లోని ఒక చిన్న పట్ట‌ణంలో ఓ మ‌హిళ త‌న స్నేహితుల‌తో క‌లిసి వెళ్తున్న‌‌ది. అప్పుడే పిల్లి అరుపులు ఆమెకు వినిపించాయి. చుట్టూ ఉన్న పొద‌ల్లో చూసింది.

కానీ ఎక్క‌డా పిల్లి క‌నిపించ‌లేదు. పిల్లి అరుపుల్ని బ‌ట్టి చెట్టు పైన ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే ఆర్ఎస్‌పిసిఏకు స‌మాచారం అందించారు. కానీ వారు 24 గంట‌లు మించితే గాని రాలేమ‌న్నారు. త‌ర్వాత రోజు కూడా పిల్లి అక్క‌డ నుంచి క‌ద‌ల్లేదు. రెస్క్యూ ఆప‌రేష‌న్ కోసం సౌత్ వేల్స్ ఫైర్ స‌ర్వీస్‌ను పిలిచారు. వీరు కూడా ఏమీ చేయ‌లేక‌పోయారు. ఇక పిల్లిని కాపాడేందుకు వీరే సిద్ద‌మ‌య్యారు. నిచ్చెన‌లు వేసుకొని మొత్తానికి సుర‌క్షితంగా పిల్లిని కింద‌కి దించారు. మాకెందుకులే అని అనుకోకుండా పిల్లి కోసం ప‌ట్ట‌ణమంతా క‌దిలి రావ‌డం ఆశ్య‌ర్యంతోపాటు ఆనందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.