శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 12, 2021 , 11:56:34

ఈ ఏడాదే హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం : డ‌బ్ల్యూహెచ్‌వో

ఈ ఏడాదే హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం : డ‌బ్ల్యూహెచ్‌వో

జెనీవా: హెర్డ్ ఇమ్యూనిటీ ల‌క్ష్యాన్ని ఈ ఏడాది చేరుకోవ‌డం అసాధ్య‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. సామూహికంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్టినా.. హెర్డ్ ఇమ్యూనిటీ ల‌క్ష్యాన్ని ఈ ఏడాది అందుకోలేమ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరోప్ ఖండంలో ఆ రేటు అధికంగా ఉన్న‌ది.  వైర‌స్ టీకాల పంపిణీ జోరుగా సాగుతున్నా.. ఈ ఏడాదే క‌రోనాను అదుపులోకి తీసుకురాలేమ‌ని ఆమె అన్నారు.  వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునే స్థాయిలో టీకాలు ఉత్ప‌త్తి చేయ‌లేమ‌ని, దీనికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారామె.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు 9 కోట్ల మందికి వైర‌స్ సోకింది. సుమారు రెండు కోట్ల మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు విడిచారు.  ఈ ఏడాది హెర్డ్ ఇమ్యూనిటీ కుద‌ర‌ద‌ని,  సామాజిక దూరం, చేతులు క‌డుక్కోవ‌డం, మాస్క్‌లు ధ‌రించ‌డం లాంటి నియ‌మాలు పాటించాల్సిందే అని సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు.  బ్రిట‌న్‌లో క‌నిపించిన కొత్త వేరియంట్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించారు.   


logo