గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 18:10:15

సమరూప కవలలు.. సమరూప కవలలనే పెళ్లాడారు.. ఒకేసారి గర్భందాల్చారు..!

సమరూప కవలలు.. సమరూప కవలలనే పెళ్లాడారు.. ఒకేసారి గర్భందాల్చారు..!

హైదరాబాద్‌: వారిద్దరూ సమరూప కవలలు. సమరూప కవలలనే పెళ్లాడాలని నిశ్చయించుకుని వెదికి పట్టుకుని మరీ అలాంటి వారినే భర్తలుగా పొందారు. దీంతోపాటు ఒకేసారి గర్భందాల్చారు. ఒకేరోజు కవలల పిల్లలను కనాలని కలలు కంటున్నారు. ఈ విషయాన్ని వారు ఇన్‌స్టాలో వెల్లడించగా, నెటిజన్లు వాళ్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. 

అమెరికాకు చెందిన బ్రిటనీ, బ్రయానా డీన్ అక్కాచెల్లెల్లు.. సమరూప కవలలు. వీరు జోష్, జెరెమీ సాలియర్స్ అనే సమరూప కవలలనే పెళ్లాడారు. ఇప్పుడు ఒకేసారి గర్భందాల్చారు. అలాగే, తమకూ తమలాగే కవలలు జన్మించాలని కోరుకుంటున్నారు. వీరికి  2018 ఆగస్టులో వివాహం జరుగగా, అప్పటినుంచి వారు ఇంటర్నెట్‌, వారి స్వగ్రామంలో సెలబ్రెటీలుగా మారారు. ఈ జంటలను చూసిన వారంతా అరే అద్దంలో చూసినట్లే ఉంది అంటూ ఆశ్చర్యపోతున్నారట. ఇప్పుడు ఒకేసారి గర్భందాల్చడంతో మళ్లీ ఫేమస్‌ అయిపోయారు. 


logo