మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 13:34:18

వైర‌స్‌పై విజ‌యం సాధించాం: కిమ్ జాంగ్‌

వైర‌స్‌పై విజ‌యం సాధించాం:  కిమ్ జాంగ్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో నార్త్ కొరియా చూపిన తెగువ‌ను ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మెచ్చుకున్నారు. వైర‌స్‌పై విజ‌యం సాధించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పోలిట్‌బ్యూరో మీటింగ్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. ప్ర‌స్తుతం దేశంలో ప‌రిస్థితి స్థిరంగా ఉంద‌ని, వైర‌స్ సంక్ర‌మ‌ణ భీక‌ర స్థాయికి వెళ్ల‌కుండా చేసిన‌ట్లు కిమ్ ఆ స‌మావేశంలో తెలిపారు. వైర‌స్‌పై విజ‌యం సాధించినా.. గ‌రిష్ట స్థాయిలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఎటువంటి నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ‌రాద‌న్నారు.  త‌మ దేశంలో జీరో కేసులు ఉన్న‌ట్లు నార్త్ కొరియా చెప్పుకుంటున్న‌ది. కానీ విశ్లేష‌కులు మాత్రం దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. వైర‌స్ కేసులు తొలుత బ‌య‌ట‌ప‌డ‌గాఏ.. ఉత్త‌ర కొరియా దేశ స‌రిహ‌ద్దుల్ని మూసివేసింది.  జ‌న‌వ‌రి నుంచే వేలాది మందిని క్వారెంటైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. logo