శనివారం 31 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 17:42:00

బద్దశత్రువు కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షమాపణలు

బద్దశత్రువు కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షమాపణలు

ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తన జీవితంలో తొలి సారి క్షమాపణలు చెప్పారు. అదీ బద్దశత్రువుగా భావించే దక్షిణ కొరియాకు, దక్షిణ కొరియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు.  ఈ విషయాన్ని సియోల్ అధికారులు అధికారికంగా ప్రకటించారు.  దీనికి కారణం లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం దక్షిణ కొరియా నేవి అధికారిని ఉత్తర కొరియా సైన్యం కాల్చి చంపింది. కొరియా యుద్ధం తరువాత దక్షిణ కొరియా అధికారిని ఇలా కాల్చి చంపడం ఇదే మొదటిసారి.

దక్షిణ కొరియా అధికారి ఉత్తర కొరియా జలాల్లోకి ప్రవేశించడం వల్లే చంపినట్టు అధికారులు పేర్కొన్నారు. కరోనా భయంతోనే ఉత్తర కొరియా ఇలా చేసినట్టు తెలుస్తోంది. దక్షిణ కొరియా అధికారిని కాల్చి చంపడంపై సీరియస్ అయిన సియోల్ అధికారులు, వివరణ కోరారు.దీనిపై నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ క్షమాపణలు చెప్పారని అధికారులు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇక్కడితో తెరపడిందా..? లేదా అనేది వేచి చూడాలి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.